అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఒక్క అనర్హుడికి ప్రభుత్వ పథకాలు అందినా మధ్యలోనే ఆపేస్తామని వరంగల్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం పెంబర్తి, ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి వద్ద ప్రజాపాలన, ఇండ్లు పథకాలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.