స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమితులై ఇల్లందుల విజయ్ బుధవారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని కలిసారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి యువజన నాయకుల పాత్ర కీలకమన్నారు. రాబోవు స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేలా యువజన నాయకులు కృషి చేయాలన్నారు.