ధర్మసాగర్ మండలంలోని రాయగూడెం లోని దర్గా హాజ్రత్ ఖాదర్ షా బాపు సైలనీ హార్మనీ ఉర్సు ఉత్సవాలకు శనివారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉర్సు ఉత్సవాలు మత సామరస్యతకు ప్రతీక అన్నారు. దర్గా అభివృద్ధికి నా వంతు పూర్తి సహాయ సహకారాలుంటాయని దర్గా నిర్వాహకులకు హామీ ఇచ్చారు.