జనగామ జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. నర్సయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం అడ్మిషన్ల సంబంధిత బ్యానర్ ను ప్రదర్శించి అవగాహన కల్పించారు. ప్రస్తుతం బీఏ, బీకామ్, బీఎస్సీ (లైఫ్ సైన్స్), బీఎస్సీ (ఫిజికల్ సై న్స్) కోర్సులు నడుస్తుండగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి బీబీఏ (జనరల్), బీఎస్సీ (ఫార్మసీ), కంప్యూటర్ సైన్స్లో డేటా సైన్స్, ఆర్టిఫిషీ యల్ ఇంటిలీజెన్స్ కోర్సులు ప్రారంభిస్తామన్నారు.