ఇందిరమ్మ మోడల్ హౌస్ ను నిబంధనల మేరకు నాణ్యతతో నిర్మాణం పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. సోమవారం ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌజ్ ను పరిశీలించారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు, సెట్ బ్యాక్ ఎంత పెట్టారు, మెటీరియల్ ఏమి వాడుతున్నారు, క్యూరింగ్ ఏవిధంగా చేస్తున్నారు, ఏ బ్రిక్స్ వాడుతున్నారు, వివరాలను అడిగి తెలుసుకున్నారు.