మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలో బుధవారం యూరియా కోసంరైతులు బారులు తీరారు. పీఏసీఎస్ లో యూరియా బస్తాలు సరిపడ ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల యూరియా తిప్పలను గుర్తించి యూరియా ను పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేశారు. సొసైటీ లో యూరియా బస్తాలు పక్కదారి పట్టకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.