అధికారం కోల్పొయి, బీఆర్ఎస్ పార్టీ ఆగమాగం అవుతున్నదని శుక్రవారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. పదవి లేకుండా ప్రజలకు సేవ చేసే అలవాటు బీఆర్ఎస్ కు లేదని, కాబట్టి, ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా.. ఎప్పుడు అధికారంలోకి రావాలా అని బీఆర్ఎస్ ఆలోచన చేస్తొందని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు.