స్టేషన్ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గుట్కాలు నిల్వ ఉంచారనే సమాచారం మేరకు గురువారం వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. మార్వాడి మిశ్రీమల్ ని అరెస్ట్ చేసి రూ. 56 వేల గుట్కాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని స్టేషన్ ఘనపూర్ పోలీసులకు అప్పగించారు.