హన్మకొండ కలెక్టరేట్ వద్ద సోమవారం మహిళ సంఘాలు ఆందోళన చేపట్టారు. ధర్మసాగర్ మండలం సిరి గ్రామైఖ్య సంఘం సభ్యులు శ్రీనిధి సంస్థ నుంచి 25 సంఘాల రుణాలు పొందారు. రుణాలకు నెలవారి చెల్లింపులను సిరి గ్రామైఖ్య సంఘంలో పని చేస్తున్న పద్మకు చెల్లిస్తున్నారు. సభ్యులు చెల్లించిన పైసలను బ్యాంకులో కట్టకుండా సొంత అవసరాలకు వాడుకుంటుందని మహిళ సంఘం సభ్యులు ఆరోపించారు. 17 లక్షల వరకు డబ్బులను వాడుకుందని సభ్యులు తెలిపారు.