మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఈనెల 26వ తేదీన మహా శివరాత్రి ఉత్సవాలపై దేవాదాయ, పోలీస్, మున్సిపల్, ఆర్టీసీ, విద్యుత్, తదితర శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. వేయి స్తంభాల దేవాలయం తోపాటు మడికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాలలో మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్షించారు.