అనుమానంతో భార్యను చంపిన భర్త
అక్రమ సంబంధం అనుమానంతో భార్యను భర్త చంపిన సంఘటన ఆందోలు గూడెంలో ఆదివారం జరిగింది. ఆందోల్ కు చెందిన నర్సింలు జీవనోపాధి కోసం హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు. భార్య ఇందిర అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించి నోటి, ముక్కుపై టవల్ ను బిగించి హత్య చేశారు. గుండెపోటుతో మరణించిందని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇందిరకు గాయాలు కావడంతో బంధువులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.