ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో.. మళ్లీ పాత సంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి వచ్చింది. 'ఒకసారి ఒక ప్రాజెక్ట్ కాంట్రాక్టుని ఏదైనా సంస్థకు అప్పగించిన తర్వాత ప్రభుత్వం దాన్ని రద్దు చేసి.. ఆ కాంట్రాక్టుని అంతకంటే తక్కువకు నిర్వహించాలని మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు.'