తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న జన్నారం మండల సర్పంచులను, గురువారం ఉదయం జన్నారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జాడి గంగాధర్ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచులకు వచ్చే బిల్లులను బడ్జెట్లో కేటాయించి ఆమోదముద్ర వేయాలన్నారు. సంతోశ్, రవి ఉన్నారు.