కడెం: అంగన్వాడీ టీచర్ పై దాడి

70பார்த்தது
అంగన్వాడీ టీచర్ పై దాడి జరిగిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం లింగాపూర్ కు చెందిన శ్రీలత అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఆమె కేంద్రానికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన పలువురు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను 108లో నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. కాగా దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி