మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య
జీవితంపై విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం కడెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని అంబార్ పేట్ కు చెందిన శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానలేకపోతున్నానని జీవితంపై విరక్తి చెంది బుదవారం రాత్రి గుర్తు తెలియని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు నిర్మల్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.