ముస్లింలంతా ఆడ-మగ, పెద్ద-చిన్న అనే భేదాలు లేకుండా ప్రతి రోజూ ఐదు పూటలా నమాజ్ చేయాలనేది ఇస్లాం ఆదేశం. ఇక రంజాన్ మాసంలో ఉపవాసదీక్ష పాటించేవారు విధిగా ఐదుపూటలా నమాజ్ చదువుతారు. దీనితో పాటు ప్రత్యేకంగా రాత్రిపూట తరావీ నమాజ్ కూ హాజరవుతారు. మూడు రోజుల నుంచి 30 రోజుల పాటు కొనసాగే తరావీ నమాజ్‌లలో ఖురాన్‌లోని మొత్తం 30 పర్వాలనూ మసీదుల ఇమాంలు చదివిస్తారు.