దస్తూరాబాద్: వైభవంగా పల్లకి సేవ

82பார்த்தது
దస్తూరాబాద్ మండలంలోని మున్యాల గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి ఆలయ అర్చకులు ఒద్దిపర్తి వంశీ కృష్ణ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి పల్లకి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుళ్లతో పల్లకిని ఊరేగించారు. మహిళలు స్వామి వారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி