రాష్ట్రంలోని కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం దస్తూరాబాద్ కేజీబీవీ కళాశాలలో రూ. 2. 30కోట్లతో నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని పేర్కొన్నారు.