ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంతభాగాన్ని పేదలకోసం ఖర్చుచేయడాన్ని జకాత్ అంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు తమ ఆదాయంలో రెండున్నర శాతం ధనాన్ని తప్పనిసరిగా పేదలకోసం ఖర్చుపెట్టాలని చెబుతుంది ఖురాన్. అలా సమకూరిన ధనంతో ఆయా సంస్థలు పేదలకు ఆహారం, దుస్తులు, విద్య, వైద్యం అందిస్తాయి. నిరుపేదలు సైతం రంజాన్ పండుగను జరుపుకునేందుకు జకాత్ ఉపయోగపడుతుంది.