యూపీలోని నోయిడాలో నగరంలో ఓ లగ్జరీ కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం నోయిడాలోని సెక్టార్ 94లో నిర్మాణంలో ఉన్న ఒక కాంప్లెక్స్ పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై వెళ్తున్న ఇద్దరు పాదచారుల్ని ఢీకొట్టింది. దీంతో వారికి గాయాలు అవ్వగా పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో దీపక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తదుపరి దర్యాప్తు కోసం కారును సీజ్ చేశారు.