ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని జామే మస్జిద్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జామే మజీద్ కు ఆసారే ముబారక్ ను దర్శించుకునేందుకు సంగారెడ్డి జిల్లా నుండే కాకుండా మహారాష్ట్ర , కర్ణాటక నుండి భక్తులు దర్శించుకున్నారు. మజీద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ గౌస్, సీనియర్ ఎంఐఎం నాయకుడు షకిల్, న్యాయవాది నోమాన్, ఇసాక్, తాజ్ పాల్గొన్నారు.