మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన గఫఫార్ కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ రూపేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023 సంవత్సరంలో బీడీఎల్ స్టేషన్ పరిధిలో 5 సంవత్సరాల బాలికపై గఫఫార్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు చెప్పారు. 11 నెలల్లో కేసును పరిష్కరించి ఉరి శిక్ష పడేలా కృషి చేసినట్లు పేర్కొన్నారు.