తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని సిపిఎం రాష్ట్ర నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్ లో సోమవారం తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ నిర్వహించారు. సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని చెప్పారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జయరాజ్, నాయకులు పాల్గొన్నారు.