ఉపాధ్యాయుల వాహనం బోల్తా
అందోల్ మండలం మాసానిపల్లి శివారులో బుధవారం ఓ వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి టీచర్లకు తీవ్ర గాయాలైయ్యాయి. విధులకు హజరయ్యేందుకు వెళ్తున్న ఉపాధ్యాయుల వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. మండలంలోని నేరడిగుంట, అక్సాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతిరోజు పటాన్ చెరు నుంచి ప్రైవేటు వాహనంలో విధులకు వస్తుంటారు. వరలక్ష్మి, పూర్ణచంద్రరావు, రాంచెందర్, మధుసూధన్‌రెడ్డి, ప్రవీణ, జ్యోతి రత్నకుమారీలు ఈ వాహనంలో ఉన్నారు.