సంగారెడ్డి: ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
సంగారెడ్డి పట్టణంలోని హనుమాన్ నగర్ మండల పరిధిలోని కొట్లాపూర్ పాఠశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం పరిశీలించారు. కొత్త ఓటరు నమోదు మార్పులు, చేర్పులు పూజ కేంద్రాల్లో చేసుకోవచ్చని చెప్పారు. 10వ తేదీన కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కేంద్రాల్లో బిఎల్వోలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.