అత్యాచార కేసులో మలయాళ నటుడు ఇడవేల బాబు అరెస్ట్‌

64பார்த்தது
అత్యాచార కేసులో మలయాళ నటుడు ఇడవేల బాబు అరెస్ట్‌
అత్యాచారం కేసులో మలయాళ నటుడు ఇడవేల బాబును పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఓ మహిళా నటి ఫిర్యాదుతో ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. ఇడవేల బాబు 'AMMA' ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇడవేల బాబును అత్యాచారం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా అరెస్టు చేసింది. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.

தொடர்புடைய செய்தி