TG: హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. అయితే గతంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు చెప్పారు.