తెలంగాణలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 2025 నుంచి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆరోగ్య బీమా అందిస్తోంది. ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ ద్వారా ఈ సదుపాయం లభిస్తుంది. ఆధార్‌లో వయసు ఉంటే చాలు, ఈ పథకానికి అర్హులు. ఆరోగ్యశ్రీ, PMJAY లబ్ధిదారులు కూడా ఇందులో చేరవచ్చు. ట్రీట్‌మెంట్, సర్జరీలు, మందుల ఖర్చులన్నీ రూ. 5 లక్షల వరకు ఉచితం. రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఈ సేవలు లభిస్తాయి.