
నాగర్ కర్నూల్: బైక్, కారు ఢీ ఇద్దరికి గాయాలు
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఇద్దరికి గాయాలైన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని ఉయ్యల వాడ గ్రామం ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో నల్లవెల్లి గ్రామానికి చెందిన సంతోష్, లక్ష్మిలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని జనరల్ ఆస్పత్రికి తరలించారు. కారును నల్లవాగు వద్ద పోలీసులు అదు పులోకి తీసుకుని పోలీస్స్టేషన్ కు తరలించారు.