కొల్లాపూర్ మండలం బోడ బండ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఎర్రగట్టు బొల్లారం గ్రామ త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని బుధవారం గ్రామస్తులు మిషన్ భగీరథ ఏఈ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు ఎస్ అశోక్ మాట్లాడుతూ కొల్లాపూర్ మండలం ఎర్రగట్టు బొల్లారం గ్రామస్తులు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఎదుర్కొంటున్నారన్నారు.