నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెలా ఈవీఎం గోడౌన్ తనిఖీ చేయాల్సిన నిబంధన ఉందని, ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల అమలును కచ్చితంగా పాటిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాముఖ్యత గల అంశమని ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.