కడ్తాల్ మండల కేంద్రంలో పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పాడిరైతులు రోడ్డు పై పాలు కింద పోసి నిరసన తెలిపారు. పాల బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర లంబాడ హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షుడు దశరథ నాయక్, సింగిల్ విండో చైర్మన్ వెంకటేష్ గుప్తా, మాజీ సర్పంచ్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనరసింహారెడ్డి మద్దతు తెలిపారు.