
కల్వకుర్తి: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కల్వకుర్తి వెల్దండ మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. అంతకుముందు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ వ్యాధి నిరోధక మందులను రోగులకు పంపిణీ చేశారు. వెల్దండ మండలంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపనలు చేశారు.