విద్యుత్ సంస్థలలో పని చేస్తున్న ఆర్టిజన్స్ ని కన్వర్షన్ చేయాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈనెల 20న తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఛలో విద్యుత్ సౌధ వాల్ పోస్టర్లను బుధవారం సీఐటీయు జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటిఐ చేసిన ఆర్టిజన్స్ కి జేఎల్ఎం, జెపిఏ ఇవ్వాలని, తదితర డిమాండ్లపై చేస్తున్న ఛలో విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.