మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో భూపల్లిపల్లి కోర్టులో కేసు వేసిన నాగవెల్లి రాజలింగమూర్తి నిన్న రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు. అయితే రాజలింగమూర్తి హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాజలింగమూర్తి తహసీల్దార్, రేంజ్ ఆఫీసర్‌తో పాటు ఒక వీఆర్ఓను సైతం ఏసీబీకి పట్టించాడు. అలాగే పలు భూవివాదాల్లో జోక్యం చేసుకోవడంతో కక్ష పెంచుకుని హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.