ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు బుధవారం రాత్రి తెరపడింది. ఢిల్లీ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్‌లో ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అలాగే ఉపముఖ్యమంత్రిగా పర్వేశ్ వర్మను ప్రకటించారు. అయితే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో సీఎంగా అవకాశం ఇవ్వండంపై రేఖ స్పందించారు. 'ఇది ఒక పెద్ద బాధ్యత. నాపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీ, బీజేపీ హైకమాండ్‌కు ధన్యవాదలు' అని తెలిపారు.