
నాగర్ కర్నూల్‌కు రానున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
నాగర్ కర్నూల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగే "బీసీ చైతన్య సభకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ మురళి మనోహర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని సభ నిర్వాహకులు సుబ్బన్న, సదానంద గౌడ్, రాజేందర్ గురువారం తెలిపారు. బీసీల చైతన్యం, బీసీ హక్కుల సాధన, ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.