రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన రైతు నిరసన దీక్ష మంగళవారం చేపట్టారు. దీక్షలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ సొంత ఊరికి, అత్తగారి ఊరికి, సొంత నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ఫోర్త్, ఫ్యూచర్ సిటీ ల పేరుతో ప్రజలను మోసం చేస్తూన్న రియల్టర్ రేవంత్ అని పేర్కొన్నారు.