
వంగూరులో పూలే జయంతి వేడుకలు
మహత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వంగూరు మండల కేంద్రంలో పూలే, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వేనేపల్లి గణేష్ రావు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు హమీద్, బహుజన నాయకులు మీసాల స్వామి, అంబేద్కర్ ప్రెసిడెంట్ గణేష్, బీసీ సంఘం మండల అధ్యక్షులు జువ్వ కృష్ణయ్య, ఎల్ల గౌడ్, నంది కృష్ణయ్య, మల్లేష్, అయినాల రమేష్, జనార్ధన్, డిoడి బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.