వనపర్తి జిల్లా నాగసానిపల్లి, ఈర్లదిన్నెలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన, మంజూరు పత్రాలు అందిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలన్నారు. కొత్తగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించే వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు పథకం నగదు లబ్ధి చేకూరుతుందని, ఇదివరకే నిర్మించిన ఇళ్లను మరమ్మతులు చేసే వారికి వర్తించదన్నారు.