మహిళలు ఒకరిపై ఆధార పడకుండా ఉపాధి శిక్షణల ద్వారా ఆర్థికంగా ఎదగాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పాలమూరు రెడ్డి వసతి గృహంలో నవరత్నాలలో భాగంగా మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న 300 మంది మహిళలకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. సహాయం కోసం ఎదురు చూడకుండా, తన స్వశక్తితో రాణించేందుకు ప్రతి మహిళ కృషి కృషి చేయాలని అన్నారు.