వంగూర్ మండలం జాజాల, అన్నారం, పోతారెడ్డిపల్లి, కోనాపూర్, పోల్కంపల్లి గ్రామాలలో ఉన్న నర్సరీలను బుధవారం ఎంపీడీవో బ్రహ్మచారి సందర్శించారు. విత్తనాలు మొలకెత్తడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను పంచాయతీ కార్యదర్శులకు వివరించారు. నర్సరీలలో నాటిన మొక్కలు జూన్ వరకు వచ్చేటట్లు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు.