సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. గురువారం కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్, తలకొండపల్లి మండలాలో సిసి రోడ్లు, భూగర్భ డ్రైనేజీలకు శంకుస్థాపన, న్యామతాపూర్ లో చెంచులకు బోరుమోటర్లు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ అని వాటిని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.