నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం గుంతకోడూర్ నుంచి యాదిరెడ్డిపల్లి వరకు 2. 90 కోట్ల రూపాయలతో నూతనంగా మంజూరు అయిన బీటీ రోడ్డుకు యాదిరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన, భూమి పూజ చేశారు. రోడ్లు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన ప్రకారం రోడ్డు శంకుస్థాపన చేశానన్నారు. నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.