నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ధరణి అనే మహిళ ఇంటికి ఇద్దరు మహిళలు బురఖాలు ధరించి వచ్చి ఇల్లు అద్దెకు కావాలని అడిగారు. ఇంటిని చూపించేందుకు వారిని లోనికి తీసుకెళ్లి చూపిస్తుండగా కత్తి చూపించి చంపేస్తామని బెదిరించారు. ఆమె మెడలో ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రమేష్ సోమవారం తెలిపారు.