నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ప్రధాన మంత్రి భారతీయ జన జౌషధీ , శాహీస్తా న్యూ లైఫ్ హాస్పిటల్, మైనారిటీ యూత్ సహాకారంతో పాదయాత్ర ద్వారా శ్రీశైలం వెళ్తున్న శివ స్వాములకై ఉచితంగా మెడికల్ క్యాంపు, పండ్లు, పానీయాలు, అల్పాహార వితరణ కార్యక్రమాన్ని బుదవారం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంబించారు. కులమతాలకు అతీతంగా సేవ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.