ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. మంగళవారం ప్రభుత్వ కార్యక్రమాలపై రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వార సమీక్షించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య పాల్గొన్నారు. త్రాగునీటి సరఫరా, రబీ పంటలకు సాగు నీరు, విద్యుత్ సరఫరా, రేషన్ కార్డుల దరఖాస్తుల ధ్రువీకరణ, రైతు భరోసా పథకాల అమలు పై సూచనలు జారీ చేశారు.