దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విజ్ఞాన కేంద్రం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. బుధవారం హనుమకొండ వంగరలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పీవీ నరసింహారావు విజ్ఞాన కేంద్రం పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఆడిటోరియం, మ్యూజియం, గ్రీనరీ, పెయింటింగ్, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, ఆర్ట్ గ్యాలరీలను పరిశీలించారు.