భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. మంగళవారం భద్రకాళి చెరువు పూడికతీత పనులను సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పూడికతీత పనులు, మట్టి తరలింపు, తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూడికతీత పనులలో భాగంగా తీసిన మట్టిని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా తరలింపు జరగాలన్నారు.