వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణా ను నియత్రించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోంది. బుధవారం కమిషనరేట్ పరిధిలో ఇసుక తరలించే వాగులను ఆకస్మికంగా సందర్శించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాల నేరెళ్ళ వాగును సందర్శించి ప్రధానంగా రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలపై సీఐ హరికృష్ణ ను అడిగి తెలుసుకున్నారు.